Monday, 30 November 2020

గుండె మంటలు

పడమటి ఆకాశం కాషాయ రంగులో స్నానం చేస్తోంది.

లోని మంటలార్పుకునే ప్రయత్నంలో సూరీడు నీలి సంద్రంలో మునక వేస్తున్నాడు.

చల్లటి పిల్లగాలి మరుగుతున్న ఇసుకని చల్లార్చడానికి పాట్లు పడుతోంది.

గోరు వెచ్చటి సంద్రపు నీటి అలలు ఒంటరి పాదాలతో దాగుడు మూతలాడుతున్నాయి.

పంచ మహా సంద్రాలు కూడా గుండె మంటలార్పలేక పోతున్నాయి.

ప్రాణం వదిలిపోయాక గుండె మంటలెలా చల్లారుతాయి? ఎవరు చల్లరుస్తారు?

No comments:

Post a Comment