Monday, 9 April 2018

ఎక్కడ దాక్కున్నావో?



ఆకాశ వీధిలో
పాలపుంత గర్భంలో
మబ్బు తల్లి వడిలో
ఎక్కడ దాక్కున్నావో, ఏలో?

ఏమి చూసావు నాలో
నడిచావు నాతో కోసులో
లేక చిన్ని చిన్ని అడుగులో
మధన పడ్డాను నాలో.

విడిచావు నన్ను క్షణంలో
ఒంటరినయ్యాను భువిలో
కనపడవు దారులో తెన్నులో
నీవు కలిసిపోయాక తారలలో.

బ్రతుకు మార్గం కానదు కళ్ళలో
నమ్మకం సడలుతున్నది భక్తిలో
చూపు ఆనదు ఏడుకొండలవాడిలో
గ్రుడ్డిగా తడబడుతున్నాను బాటలో

అంతా ఒక్కటే ఎండో వెన్నెలో
మండుతున్నది అగ్ని గుండెలో
క్షణం శాంతి లేదు ఆత్మలో
ఇలా ఇంకెన్నాళ్లో, ఎన్నేళ్లో?

బ్రతుకలేను మరణించలేను, బ్రతకాలి కానీ ఎలా?
గడ్డిపోచ పర్వతమైంది, క్షణం యుగమైంది.

వెతుకుతున్నాను మబ్బు తల్లి వడిలో
అన్వేషిస్తున్నాను పాలపుంత గర్భంలో
నిరీక్షిస్తున్నాను ఆకాశ వీధిలో
ఎక్కడ దాక్కున్నావో, ఏలో?


***

No comments:

Post a Comment